మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ మామ తన కోడలిని అత్యాంత కిరాతకంగా హతమార్చాడు. కోటపల్లి మండలం లింగన్నపేటలో ఈ ఘటన జరిగింది., 3 నెలల క్రితం లింగన్నపేటకు చెందిన తిరుపతి కుమారుడు సాయికృష్ణతో.. అదే గ్రామానికి చెందిన సౌందర్య(19)తో ప్రేమ వివాహం జరిగింది.
సౌందర్యను ప్రేమించి పెళ్లాడిన సాయికృష్ణ.. రెండు నెలలకే అత్మహత్య చేసుకున్నాడు. భర్త మృతిచెందిన తర్వాత ఆదే గ్రామంలో ఉంటున్న తల్లి వద్ద సౌందర్య ఉంటోంది. ఈరోజు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్లిన తిరుపతి.. కోడలు సౌందర్య గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.