విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్‌

విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్‌హైదరాబాద్ : తెలంగాణలోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలువులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై  ఉన్నత స్థాయి సమీక్షలో  సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు. ఈ సమీక్షకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ వ్యాప్తి తదితర అంశాలపైనా సీఎం సమీక్షించారు.