‘బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి’ ఫస్ట్ లుక్ విడుదల

రాఘవేంద్రరావు చేతుల మీదుగా సంపూర్ణేష్ బాబు ‘బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి’ ఫస్ట్ లుక్ విడుదల..‘బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి’ ఫస్ట్ లుక్ విడుదలహైదరాబాద్ : బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్రిలియంట్ బాబు.. సన్నాఫ్ తెనాలి. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కుమార్ చందక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమక్షంలో జరిగింది.

ఆయన చేతుల మీదుగా సంపూర్ణేష్ కొత్త సినిమా టైటిల్ లాంచ్ విడుదల చేసారు. ఈ సినిమాకు శివరాం డైలాగ్స్ అందిస్తుండగా.. DSR సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: వెల్డింగ్ శ్రీను
నిర్మాత: రాజ్ కుమార్ చందక
బ్యానర్: రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్
కెమెరా: ముజీర్ మాలిక్
సంగీతం: D S R
డైలాగ్స్: శివరాం
పాటలు: భాసకర్ భట్ల, శ్రీరాం తపస్వి
ఎడిటర్ : నాగిరెడ్డి
నిర్మాణ నిర్వహణ: బాలాజీ శ్రీను
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, లక్ష్మీ నివాస్