మకరజ్యోతి దర్శనంతో పులకించిన భక్తులు

మకరజ్యోతి దర్శనంతో పులకించిన భక్తులు

మకరజ్యోతి దర్శనంతో పులకించిన భక్తులువరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : అయ్యప్ప జ్యోతి దర్శనంతో పులకరించిన పొన్నాం బలమేడు పర్వతం హరిహర క్షేత్రం శబరిమల స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తజనులతో మునిగిపోయింది. మకర సంక్రాంతి సందర్భంగా శనివారం రాత్రి జ్యోతి దర్శనంతో లక్షలాది మంది భక్తులు పులకరించిపోయారు. మొదటగా పందలం నుంచి తీసుకొచ్చిన తిరునాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి తర్వాత పొన్నాం బలమేడు పర్వత శిఖరాలలో మూడుసార్లు జ్యోతి దర్శనం అయింది. అయ్యప్ప శరణు ఘోషతో శబరిమల పొన్నాంబల మేడ చుట్టుపక్కల ప్రాంతాలు మారుమోగాయి. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు శబరిమల చేరుకొని అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.