పోక్సో చట్టం కింద ఓ తండ్రిపై కేసు నమోదు
వరంగల్ టైమ్స్, విజయవాడ : అందరి బాగోగులు చూడాల్సిన కుటుంబ పెద్ద, అభంశుభం తెలియని కన్న కుమార్తెపై కన్నేశాడు. మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ.. సభ్యసమాజం నివ్వెరపోయేలా చేశాడు. ఈ అమానవీయ ఘటన విజయవాడలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మాచవరానికి చెందిన ఓ వ్యక్తి కారు డ్రైవరుగా పనిచేస్తూ ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కుమార్తెలు. ఒకసారి భర్త ఫోన్లో భర్త, పెద్ద కుమార్తె (13)ల నగ్నచిత్రాలు చూసిన భార్య.. వాటి గురించి ప్రశ్నించింది. అవి నిజ మైనవి కావంటూ అతడు వాటిని తొలగించడంతో ఊరుకుంది. భర్త ప్రవర్తన సరిగా లేకపోవటంతో ఇద్దరు కుమార్తెలను 2022 జులై నుంచి గన్నవరంలోని ఓ వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. ఈ నెల 7న కుమార్తెలిద్దరూ ఇంటికి వచ్చారు. పెద్ద కుమార్తె తనకు దూరంగా ఉండటంతో తండ్రి బెల్టుతో చావగొట్టాడు. అడ్డుకున్న భార్యను దుర్భాషలాడాడు.
తర్వాత పిల్లలిద్దరూ వసతి గృహానికి వెళ్లిపోయి తిరిగి 10వ తేదీన వచ్చారు. ఆ రోజు సాయంత్రం తండ్రి పెద్ద కుమార్తెను బ్యాంకు పని ఉందని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తీసుకెళ్లి తర్వాత తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో పెద్ద కుమార్తె తల్లి వద్దకు వచ్చి వెళ్లి, తండ్రి తనపై చేసిన అఘాయి త్యాన్ని చెప్పింది. బ్యాంకుకని చెప్పి రామవరప్పాడు పైవంతెన సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి, అక్కడ అత్యాచారం చేసినట్లు వివరించింది. తండ్రి చర్యలను అడ్డుకోగా తనను ముళ్లకర్రతో కొట్టినట్లు వివరించింది. తనపై మూడేళ్లుగా అత్యాచారం చేస్తు న్నట్లు కుమార్తె చెప్పటంతో తల్లి భోరున విలపించారు. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పోక్సో చట్టం కింద బాలిక తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.