గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న దాస్యం దంపతులు

గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న దాస్యం దంపతులు

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : బాలసముద్రం ఏకశిలా పార్క్ ఆవరణలోని శ్రీ సీతరామంజనేయ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ధనుర్మాసోత్సవాన్ని పురస్కరించుకుని గోదాదేవి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్-రేవతి దంపతులు కుటుంబసమేతంగా పాల్గొన్నారు.గోదాదేవి కల్యాణంలో పాల్గొన్న దాస్యం దంపతులువేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగింది. చీఫ్ విప్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి ఆశీర్వచనం అందించి దీవించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.