గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై టీఎస్పీఎస్సీ అప్పీలుపై హైకోర్టు విచారణ జరిపింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఐతే ప్రస్తుతానికి గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు విడుదల చేసుకోవచ్చని కోర్టు సూచించింది. అభ్యర్థి స్థానికత వివాదం తర్వాత తేలుస్తామని కోర్టు స్పష్టం చేసింది.