కొత్తగూడెంలో వద్దిరాజు హవా!!

కొత్తగూడెంలో వద్దిరాజు హవా!!

కొత్తగూడెంలో వద్దిరాజు హవా!!

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : కొత్తగూడెం సిట్టంగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు ఈసారి సీటు ఇచ్చే పరిస్థితి లేదని బీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పటికే స్పష్టం చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సీటు ఇవ్వడానికి హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు టాక్. వద్దిరాజు రవిచంద్రకు కొత్తగూడెంతో మంచి అనుబంధం ఉంది. పార్టీలకతీతంగా నేతలందరితో మంచి సాన్నిహిత్యం ఉంది. దీనికి తోడు వ్యాపార సంబంధాలున్నాయి. ఆర్థికంగా బలమైన నాయకుడు. ఇవన్నీ ఆయనకు సానుకూల అంశాలు. పైగా ఆయనకు సీటు ఇస్తే వద్దనే వారు కూడా ఎవరూ లేరట. దీంతో వద్దిరాజు రవిచంద్రకు సీటు ఇవ్వడం లాంఛనమేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి వద్దిరాజు రవిచంద్రకు సీటు ఇవ్వాలని కొత్తగూడెం లోకల్ నాయకులే హైకమాండ్ కు సూచించినట్లు సమాచారం. బీజేపీ నుంచి పొంగులేటి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనకు ధీటుగా వద్దిరాజు రవిచంద్ర అయితేనే బెటర్ అని పార్టీ పెద్దలకు చెప్పినట్లు టాక్. పొంగులేటికి చెక్ పెట్టాలంటే ఇంతకంటే మంచి అభ్యర్థి లేరని యువనేత కేటీఆర్ కూడా పార్టీ నేతలతో అన్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ సానుకూలంగా ఉండడం, లోకల్ క్యాడర్ మద్దతివ్వడం లాంటి అంశాలు వద్దిరాజు రవిచంద్రకు ప్లస్ గా మారాయి. దీంతో ఆయన కూడా కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నిలబడితే.. ప్రత్యర్థులు ఎవరైనా ఆయనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ పొంగులేటి వచ్చినా వద్దిరాజుకే అన్నీ అనుకూలిస్తాయన్న ప్రచారం జరుగుతోంది. పొంగులేటి పార్టీ మారడం, బీఆర్ఎస్ ఈ మధ్య కొత్తగూడెంలో జోరు పెంచడం, వద్దిరాజు రవిచంద్రకు క్లీన్ ఇమేజ్ ఉండడం ఇవన్నీ కలిసొచ్చే అవకాశాలున్నాయని టాక్. కొత్తగూడెం ఓటర్ల మదిలోనూ వద్దిరాజు పేరు ప్రముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వద్దిరాజు రవిచంద్ర పార్టీ హైకమాండ్ కు అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్థికంగా బలంగా ఉండడం, దీనికి తోడు కొత్తగూడెం ఏరియాలో వద్దిరాజుకు పరిచయాలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ బీఆర్ఎస్ హైకమాండ్ గమనించిందట. అందుకే ఓ సర్వే కూడా చేయించినట్లు టాక్. ఆ సర్వేలో వద్దిరాజుకు మంచి మార్కులే పడినట్లు సమాచారం. ఆయనకు సీటు ఇస్తే గెలుపు ఖాయం అని సర్వేలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో వద్దిరాజుకు టికెట్ ఇవ్వడానికి పార్టీ హైకమాండ్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

కొత్తగూడెం నుంచి పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ హైకమాండ్ నుంచి ఇప్పటికే వద్దిరాజు రవిచంద్రకు ఫోన్ వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అంతేకాదు ఆయనకు సీటిస్తే చాలు గెలిపించుకుని వస్తామని బీఆర్ఎస్ శ్రేణులంతా బల్లగుద్ది చెబుతున్నారట. అన్నీ సానుకూల అంశాలే కనిపిస్తున్న తరుణంలో వద్దిరాజు రవిచంద్ర కొత్తగూడెంలో జెండా పాతడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు వద్దిరాజు బరిలో నిలిస్తే వార్ వన్ సైడ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. ఆస్థాయిలో వద్దిరాజు రవిచంద్రకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఈస్థాయిలో అన్నీ అనుకూలంగా ఉన్నాయంటే మామూలు విషయం కాదు. అది వద్దిరాజు రవిచంద్ర లాంటి వారికే సాధ్యం అంటున్నారు ఆయన సన్నిహితులు!!