ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత 

ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఫుట్ బాల్ దిగ్గజం పీలే(82) మృతి చెందారు. పేదరికం నుంచి ఆధునిక చరిత్రలో గొప్ప, ప్రసిద్ధ అథ్లెట్లలో ఒకరిగా ఎదిగిన లెజెండరీ ఆటగాడు కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సావోపాలోని అల్బర్ట్ ఐన్ స్టీన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారని పీలే కూతురు ప్రకటించింది.ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత గత యేడాది పెద్దపేగు క్యాన్సర్ బారినపడ్డారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటున్నారు. ఐతే ఇటీవల ఆరోగ్యం విషమించడంతో అవయవాలు పనిచేయడం మానేశాయి. దీంతో కొన్నిరోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. పీలే అసలు పేరు ఎడ్సన్ అరాంట్స్ డో నాసిమియాంటో.

అతను బ్రెజిల్ కు మూడుసార్లు ( 1958, 1962, 1970) వరల్డ్ కప్ అందించిన ఏకైక వ్యక్తి పీలే. 1940, అక్టోబర్ 23న జన్మించారు పీలే. 1956లో శాంటోస్ క్లబ్ లో చేరారు. 17 యేండ్ల వయస్సులోనే ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో బ్రెజిల్ కు ప్రాతినిథ్యం వహించారు. 1958లో స్వీడెన్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ లో జట్టులో ప్రధాన పాత్ర పోషించారు. పీలే బ్రెజిల్ తరపున 92 అంతర్జాతీయ మ్యాచ్ లలో 77 గోల్స్ చేశారు. మొత్తం 1,363 మ్యాచ్ లలో 1,281 గోల్స్ చేశారు. 2000లో ‘ప్లేయర్ ఆఫ్ ది సెంచరీ’గా ఎంపికయ్యారు.