ప్రధాని మోడీకి మాతృవియోగం 

ప్రధాని మోడీకి మాతృవియోగం

ప్రధాని మోడీకి మాతృవియోగం 

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కల్గింది. మోడీ మాతృమూర్తి హీరాబెన్ మోడీ శుక్రవారం తెల్లవారుజామున 3.39 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఇటీవలే 100వ పుట్టినరోజు పూర్తిచేసుకున్న ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐతే ఆమె ఆరోగ్యం విషమించడంతో నేడు ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ హుటాహుటిన ఢిల్లీ నుంచి గుజరాత్ చేరుకున్నారు.

తల్లి మరణంపై ప్రధాని మోడీ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. ‘నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుని చెంతకు చేరింది. ఆమె జీవిత ప్రయాణం ఒక తపస్సు లాంటిది ‘ అని ట్విట్టర్ లో పోస్టు చేశారు. కాగా, హీరాబెన్ రెండ్రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు లోనైన విషయం తెలిసిందే. దీంతో యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ప్రధాని మోడీ గంటన్నరకు పైగా ఆస్పత్రిలోనే గడిపారు. తల్లి ఆరోగ్యం గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే హీరాబెన్ తుది శ్వాస విడిచారు.