తుది దశకు రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ చిత్రం

తుది దశకు రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ చిత్రం

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ జంటగా ఓ కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా, అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తుది దశకు రాహుల్ విజయ్, మేఘ ఆకాష్ చిత్రంరొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా ప్లానింగ్ తో అనుకున్నది అనుకున్నట్లు షూటింగ్ చేసుకుంటోంది. రెండు షెడ్యూల్స్ చిత్రీకరణతో ఇప్పటికే 90 శాతం రూపకల్పన పూర్తి చేసుకుంది. ఇటీవలే గోవాలో ముగిసిన రెండో షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ సినిమా ఇదని నిర్మాతలు ఏ.సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట అన్నారు. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. అభిమన్యు బద్ది డెబ్యూ డైరెక్టర్ అయినా పక్కా ప్లానింగ్ తో వేసిన షెడ్యూల్స్ వేసినట్లు షూటింగ్ చేస్తున్నారు. తాజాగా గోవాలో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. దీంతో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇదే స్పీడ్ తో సినిమాను కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తాం అని వారు అన్నారు.

నటీనటులు – రాహుల్ విజయ్, మేఘ ఆకాష్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, అభయ్ బెతిగంటి, వైవా హర్ష, బిగ్ బాస్ సిరి తదితరులు

సాంకేతిక నిపుణులు – సంగీతం : హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి,
ఆర్ట్ డైరెక్టర్ : కె. వి రమణ
సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి
పి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా, నిర్మాత : ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట, సమర్పణ : బిందు ఆకాష్, నిర్మాణ సంస్థలు : కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం – అభిమన్యు బద్ది.