రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్ 

రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ సిండికేట్ ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ.40 కోట్ల విలువైన 6.2 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఢిల్లీకి చెందిన రాకేష్ కుమార్, నైజీరియాకు చెందిన ఒబుమునెమి ఎంచుక్వుగా గుర్తించారు. ఎంచుక్వు ప్రస్తుతం ఢిల్లీలోని మహేంద్ర పార్క్ ప్రాంతంలో నివసిస్తున్నారు. నిందితుల నుంచి పోలీసులు ప్రాసెసింగ్, ప్యాకింగ్ మెటీరియల్, మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. నైజీరియన్ అద్దెకు ఉంటున్న ఇంటి నుంచి నిందితులు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.రూ. 40 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్ పశ్చిమ ఢిల్లీ కేంద్రంగా నైజీరియన్లు సిండికేట్ లోని ఇతర సభ్యుల సహకారంతో నార్కోటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేపట్టినట్లు ఏసీపీ ప్రత్యేక సెల్ అత్తార్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్ ఢిల్లీ, పంజాబ్, హర్యానాలో డ్రగ్ కన్ సైన్మెంట్స్ ను క్లయింట్లకు సరఫరా చేస్తోందని వెల్లడించారు. సిండికేట్ సభ్యుల కదలికలను పసిగట్టి జీటీ కర్నాల్ రోడ్ లో దాడులు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.