ఇద్దరు న్యాయవాదులకు సుప్రీంలో జరిమానా
వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : ఇద్దరు న్యాయవాదులకు నేడు సుప్రీంకోర్టు 8 లక్షల జరిమానా విధించింది. ట్రాఫిక్ ఆంక్షలు, వాయు కాలుష్యంపై అనుచిత పిటిషన్ వేసిన ఘటనలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఆ బెంచ్ లో జస్టిస్ ఎల్. నాగేశ్వర రావు, ఏఎస్ బొప్పన్న, బీఆర్ గవాయి ఉన్నారు. ఎన్జీటీ ఆదేశాలను మీరు చదివవారా, ఐనా ఈ పిటిషన్ ఫైల్ చేయాలనుకుంటున్నారా, దీనిపై మీరు నమ్మకంతో ఉన్నారా అని సుప్రీం ధర్మాసనం ఈ న్యాయవాదులను ప్రశ్నించింది.సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ఇద్దరు న్యాయవాదులు తప్పుడు పిటిషన్ ఫైల్ చేశారని, వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడని, వారికి 8 లక్షల జరిమానా వేశామని, ఆ అడ్వకేట్లు వేసిన పిటిషన్ ను రిజిస్ట్రీ ఎంకరేజ్ చేయదని ధర్మాసనం పేర్కొన్నది. 15 యేళ్ల పెట్రోల్ వాహనం, పదేళ్ల డీజిల్ వాహనంపై ఉన్న బ్యాన్ ను పిటిషనర్ తప్పుపడుతూ కోర్టును ఆశ్రయించిన కేసులో ఈ ఘటన జరిగింది. అడ్వకేట్ అనురాగ్ సక్సేనా ఈ పిల్ వేశారు.