గాయపడిన కార్యకర్తని పరామర్శించిన జంగా

గాయపడిన కార్యకర్తని పరామర్శించిన జంగా

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే జీఎం కార్యాలయం ముట్టడిలో కాజీపేటకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీ సాధనకోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన సికింద్రాబాద్ జీఎం కార్యాలయం ముట్టడిలో భాగంగా కాజీపేట నుండి జనగామ డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరిలి వెళ్లారు. జీఎం కార్యాలయం ముట్టడి నిర్వహిస్తున్న క్రమంలో తోపులాట జరిగి కాజీపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివరాజ్ తీవ్రగాయాల పాలయ్యారు. గాయాలైన శివరాజ్ ను తోటి కార్యకర్తలు హైద్రాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివరాజ్ ను మాజీ డీసీసీబి అధ్యక్షులు, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి పరమార్శించి ధైర్యం చెప్పారు.