కైకాల సత్యనారాయణ ఇకలేరు

కైకాల సత్యనారాయణ ఇకలేరుకైకాల సత్యనారాయణ ఇకలేరు

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ (87) ఇకలేరు. కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని తన సొంత ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కైకాల సత్యనారాయణకు భార్య నాగేశ్వరమ్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కైకాల మృతితో చిత్ర పరిశ్రమతో పాటు ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది.
కైకాల సత్యనారాయణ పార్థీవదేహాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. సినీ హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్, వెంకటేశ్, దర్శకులు కె. రాఘవేందర్ రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బాబీ, నిర్మాత చినబాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు.