కైకాల మృతిపట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రసిద్ధ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ మృతి పట్ల చింతిస్తున్నానని మోడీ అన్నారు. విలక్షణ నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులని ప్రధాని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఓం శాంతి అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.