కైకాల మృతిపై సంతాపం తెల్పిన సీఎంలు 

 కైకాల మృతిపై సంతాపం తెల్పిన సీఎంలు

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. కైకాల మృతిపై సంతాపం తెల్పిన సీఎంలు గొప్ప వ్యక్తిత్వం కల్గిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. నటుడిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారని గుర్తు చేశారు. ఎంపీగాను ప్రజలకు మరింత దగ్గరయ్యారని అన్నారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాని సీఎం జగన్ ట్వీట్ చేశారు.