సంక్రాంతి బరిలోకి ‘తెగింపు’

సంక్రాంతి బరిలోకి ‘తెగింపు’

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : కోలీవుడ్, టాలీవుడ్‌లో స్టార్ హీరోగా అజిత్ కుమార్‌కు అసామాన్యమైన అభిమాన గణం ఉంది. అజిత్ నటించే సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి దగ్గరైన అజిత్ తన కొత్త సినిమాతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. సంక్రాంతి బరిలోకి అజిత్ కుమార్ తెగింపు అంటూ రాబోతోన్నారు. తునివు అంటూ తమిళంలో సందడి చేయనున్న అజిత్.. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగింపు అనే టైటిల్‌తో రాబోతున్నారు.సంక్రాంతి బరిలోకి 'తెగింపు'తలా అంటూ ముద్దుగా పిలుచుకునే అజిత్‌ కుమార్ సినిమాలకు కోలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. తెలుగులోనూ అజిత్ సినిమాకు ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి తెగింపు అంటూ అజిత్ రాబోతున్నాడని తెలియడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బోనీ కపూర్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా.. హెచ్ వినోద్ తెరకెక్కించారు. ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందించారు. ప్రముఖ సినిమాటోగ్రఫర్ నీరవ్ షా కెమెరామెన్‌గా పని చేశారు.

రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంయుక్తంగా తెగింపు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తోంది. సంక్రాంతి బరిలో దిగబోతోన్నట్టుగా మేకర్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అజిత్ కుమార్ ఎంతో సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించిన అఫీషియల్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ చిత్రంలో మంజు వారియర్, జాన్ కొక్కెన్, సముద్రఖణి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.