జేఎల్ పోస్టులు..జనవరి 10వరకు దరఖాస్తులు

జేఎల్ పోస్టులు..జనవరి 10వరకు దరఖాస్తులు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 2022 , డిసెంబర్ 20న ప్రారంభమైంది. అభ్యర్థులు 2023, జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబర్ 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉండే. అయితే సాంకేతిక కారణాల వల్ల డిసెంబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.అభ్యర్థులు తమ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ. 200, పరీక్ష ఫీజు రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపిక చేపట్టనున్నారు.

తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ల భర్తీకి టీఎస్పీఎస్సీ డిసెంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో మల్టీ జోన్-1 పరిధిలో 724 పోస్టులు, మల్టీ జోన్ -2 పరిధిలో 668 పోస్టులున్నాయి. జూన్ లేదా జులైలో ఉద్యోగాల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఖాళీల్లో అత్యధికంగా మ్యాథ్స్ -154, ఇంగ్లీష్ -153, జువాలజీ-128, బోటనీ, కెమిస్ట్రీ-113, ఫిజిక్స్ -112, హిందీ-117 పోస్టులున్నాయి.