మిసెస్ వరల్డ్-2022 టైటిల్ విన్నర్ సర్గమ్ కౌశల్ 

మిసెస్ వరల్డ్-2022 టైటిల్ విన్నర్ సర్గమ్ కౌశల్

మిసెస్ వరల్డ్-2022 టైటిల్ విన్నర్ సర్గమ్ కౌశల్ వరంగల్ టైమ్స్, లైఫ్ స్టైల్ డెస్క్ : ‎ఇండియాకు చెందిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్-2022 టైటిల్ ను సొంతం చేసుకున్నది. శనివారం వెస్ట్ గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన కార్యక్రమంలో 2021 విజేత అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్ ..సర్గమ్ కౌశల్ కు కిరీటాన్ని బహూకరించింది. 63 దేశాలకు చెందిన మహిళలను ఓడించి కిరీటాన్ని సొంతం చేసుకున్నది. పోటీల్లో పాలినేషియా, కెనడాకు చెందిన వనితలు రన్నరప్స్ గా నిలిచారు. దాదాపు 21 సంవత్సరాల భఆరత్ నుంచి సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్ గా ఎంపికైనట్లు మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెల్పింది.

ఐతే, టైటిల్ ను సాధించండపై సర్గమ్ కౌశల్ హర్షం వ్యక్తం చేసింది. 21-22 యేండ్ల తర్వాత భారత్ తరపున మళ్లీ కిరీటాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని చెప్పింది. లవ్ యూ ఇండియా.. లవ్ యూ వరల్డ్ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. సర్గమ్ కౌశల్ ఇన్ స్టా పోస్టు ప్రకారం, ఆమె జమ్మూ కశ్మీర్ కు చెందిన మహిళ కాగా, ఆమె ఇంగ్లీష్ సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. ఆమె గతంలో విశాఖపట్టణంలో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. తన భర్త ఇండియన్ నేవీలో పని చేస్తున్నట్లు తెల్పింది.