ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం
వరంగల్ టైమ్స్, ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం వచ్చింది. సోమవారం ఉదయం 1.50 ని.లకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెల్పింది. ఉత్తరకాశీకి 24 కి.మీ.ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.భూ అంతర్భాగంలో 5 కి.మీ. లోతు కదలికలు సంభవించాయని తెల్పింది. కాగా అర్ధరాత్రి సమయంలో భూమి కంపించడంతో ఇళ్లల్లో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు.