15 వేలు దాటిన టర్కీ, సిరియా మృతులు 

15 వేలు దాటిన టర్కీ, సిరియా మృతులు

15 వేలు దాటిన టర్కీ, సిరియా మృతులు 

వరంగల్ టైమ్స్, ఇంటర్నెట్ డెస్క్ : టర్కీ, సిరియాలో భూకంప మృతుల సంఖ్య అధికమవుతుంది. భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది రాత్రి, పగలు అని తేడా లేకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

దీంతో శిథిలాల కింది నుంచి పెద్ద సంఖ్య మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా ఇరుదేశాల్లో భూకంప మృతులు 20 వేలకు పైగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.