5 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య 

5 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

5 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య 

వరంగల్ టైమ్స్, టర్కీ : టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సోమవారం నుంచి వరుసగా సంభవించిన భారీ భూకంపాల కారణంగా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా అక్కడ మృతుల సంఖ్య 5 వేల దాటినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఒక టర్కీలోనే సుమారు 4 వేల మంది మరణించారు. 20,534 మంది ప్రజలు గాయపడ్డారు.

ఇక సిరియాలో 1,602 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,649 మందికి తీవ్రగాయాలయ్యాయి. రెండు దేశాల్లో కలిసి ఇప్పటివరకు 5 వేల మందికి పైనే మృతి చెందారు. భారీగా సంభవించిన భూకంపం ధాటికి టర్కీలో ఇప్పటి వరకు 11 వేలకు పైగా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దాదాపు 25 వేల మంది ఎమర్జెన్సీ వర్కర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

రెస్క్యూ ఆపరేషన్లు జోరుగా సాగుతున్నాయి. గాయపడ్డవారిని తరలించేందుకు 10 నౌకలు, 54 విమానాలు రంగంలోకి దిగాయి. శిథిలా కింద వేల సంఖ్యలో ప్రజలు చిక్కుకున్నట్లు స్థానిక మీడియా అంచనా వేస్తోంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెల్పింది.