ఏపీలో మరో రెండ్రోజులు దంచికొట్టుడే

ఏపీలో మరో రెండ్రోజులు దంచికొట్టుడే

warangaltimes, అమరావతి : ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల వడగండ్లు కూడా పడ్డాయి. ఈ వర్షాలు మరో 2 రోజులు కంటిన్యూ అవుతాయి. సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు ఉన్న ద్రోణి ఇప్పుడు గాలికోత గా అంతర్గత తమిళనాడు నుండి మధ్య ప్రదేశ్ వరకు రాయలసీమ, తెలంగాణ మరియు విదర్భ మీదుగా కొనసాగుతున్నది. ఉపరితల ఆవర్తనం నుండి బంగ్లాదేశ్ & పొరుగు ప్రాంతాల పై నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేస్ వరకు గంగా నది పశ్చిమ బెంగాల్ & ఒడిశా మీదుగా సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ద్రోణి ఇపుడు బలహీనపడినది.