ఈడీ విచారణకు హాజరైన కల్వకుంట్ల కవిత
వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. అందరికీ అభివాదం చేస్తూ , పిడికిలి బిగించి మనదే విజయం అనే సంకేతం ఇస్తూ కవిత ఈడీ కార్యాలయంలోపలికి వెళ్లారు. కాగా కవితకు మద్దతు తెలిపేందుకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు తుగ్లక్ రోడ్డులోని నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో కవిత భేటీ అయ్యారు.