ఆర్బీఓ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్

ఆర్బీఓ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : భారతీయ స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ ( ఆర్బీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎంపికైనవారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ పోస్టుల్లో నియమించనుంది. బ్యాంకింగ్ లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 31తో ఆన్లైన్ దరఖాస్తుల గడువు ముగియనుంది. హైదరాబాద్ లో 48 పోస్టులున్నాయి.

మొత్తం పోస్టులు 868లో జనరల్ కోటాలో 379 పోస్టులు, ఎస్సీ కోటాలో 136 పోస్టులు, ఎస్టీ కోటాలో 57 పోస్టులు, ఓబీసీ కోటాలో 216 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 80, పీడబ్ల్యూడీ కోటాలో 45 చొప్పున పోస్టులున్నాయి.

అర్హతలు : రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులై ఉండాలి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నవారు, సస్పెండ్ అయినవారు, ఉద్యోగానికి రాజీనామా చేసిన వారు అప్లయ్ చేసుకోవడానికి అనర్హులు. అభ్యర్థులు 2023 మార్చి నాటికి 63 యేండ్ల లోపువారై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ : మార్చి 31
వెబ్ సైట్ : sbi.co.in