ఐపీఎల్ 2022 లో చెన్నైపై సన్ రైజర్స్ జయభేరీ

ఐపీఎల్ 2022 లో చెన్నైపై సన్ రైజర్స్ జయభేరీ

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ 2022 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ ఘన విజయం సాధించింది. తొలి రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన విలియమ్సన్ సేన, శనివారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా సీజన్ లో జడ్డూ సేనకు ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం గమనార్హం. టాస్ గెలిచిన ఎస్ఆర్ హెచ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.ఐపీఎల్ 2022 లో చెన్నైపై సన్ రైజర్స్ జయభేరీఅనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 17.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. మరో 14 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 75 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్న అభిషేక్ కు ‘ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది .కెప్టెన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి రాణించడంతో ఎస్ఆర్ హెచ్ ఈ సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నై ఈ సీజన్ లో వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది.