ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కల్గినవారు ఈ నెల 28 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 8 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో మేనేజర్ 2, అడ్వయిజర్ 4, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 2 చొప్పున ఉన్నాయి.ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు అర్హతలు : ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎకనామిక్స్ , స్టాటిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, బీకామ్, బీఈ, బీటెక్, ఎంబీఏ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ. 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 28
వెబ్ సైట్ : www.sbi.co.in