టీఎస్ హైకోర్టులో ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలు
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 8 ట్రాన్స్ లేటర్ ( తెలుగు/ఉర్ధూ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి బ్యాచిలర్ డిగ్రీ ( ఆర్ట్స్ /సైన్స్/లా ) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు/ఉర్దూ ట్రాన్స్ లేషన్ లో డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సుతో కూడా ఉండాలి. అలాగే అనువాదంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 11, 2023 వరకు 18 నుంచి 34 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
ఆసక్తి కల్గిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 11, 2023 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభమవుతుంది. ఓసీ/బీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు రూ.400లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష 2023 మార్చిలో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.42,300 ల నుంచి రూ,1,15,270వ వరకు జీతంగా చెల్లిస్తారు.