క్రికెట్ లోని ఆల్ ఫార్మాట్లకు బజ్జీ గుడ్ బై

క్రికెట్ లోని ఆల్ ఫార్మాట్లకు బజ్జీ గుడ్ బైస్పోర్ట్స్ డెస్క్ : టీం ఇండియా క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు హర్భజన్ సింగ్ గుడ్ బై చెప్పారు. ఈమేరకు హర్భజన్ సింగ్ తన ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటన చేశారు. ” నాకు ఎన్నో మంచి అవకాశాలు వచ్చాయి.

జీవితంలో నాకు అన్నింటిని అందించిన ఆటకు నేడు వీడ్కోలు పలుకుతున్నాను. 23 యేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని అందంగా , గుర్తుండిపోయే విధంగా మార్చిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు. నా కెరీర్ నాకు సహకరించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ బజ్జీ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

ఇప్పటివరకు హర్భజన్ సింగ్ 367 ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడగా, ఇందులో ఏకంగా 711 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 2 టెస్ట్ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.