తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపు

తెలంగాణలో సినిమా టికెట్ల ధర పెంపుహైదరాబాద్ : తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధికారుల కమిటీ సిఫారసుతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. టికెట్ల ధర పెంపునకు సంబంధించి ఈ నెల 21న జీవో విడుదైంది. నాన్ ఏసీ థియేటర్లలో కనీస టికెట్ ధర రూ.30, గరిష్ఠ ధర రూ. 70, ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.50, గరిష్ఠ ధర రూ. 150, మల్టీప్లెక్స్ లో కనీస ధర రూ.100, గరిష్ఠ టికెట్ ధర రూ.250, మల్టీప్లెక్స్ రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా రూ.300 నిర్ణయించారు. సినిమా టికెట్ ధరలకు జీఎస్టీ, నిర్వహణ ఛార్జీలు అదనంగా వసూలు చేయనున్నారు.