భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : పాత ఆలోచనలను భోగి మంటల్లో కాల్చేసి, సరికొత్త విధానాలతో జీవితంలో ముందుకెళ్లే విధంగా ప్రయత్నించాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద జరిగిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి భారత జాగృతిగా రూపొందిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా సంక్రాంతి సంబరాలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. హరిదాసులు, బసవన్నల దీవెనలతో భారతదేశం వర్దిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అందరూ ‌నెగటివ్ ఆలోచనలను వదిలేసి, దేశం కోసం, సమాజం కోసం పాటుపడాలని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శతాబ్దాల క్రితం మారిషస్ వెళ్లి అక్కడ స్థిరపడిన తెలుగు సమాజం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు.భోగి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితమారిషస్ దేశంలో తెలుగు సంస్కృతిని కాపాడేందుకు తరతరాలుగా కృషి చేస్తున్న మారిషస్ తెలుగు సంఘం ప్రతినిధులకు, అక్కడ జరగనున్న తెలుగు మహాసభలకు సహకారం ఉంటుందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో, పూర్తి గ్రామీణ వాతావరణాన్ని ఏర్పాటు చేసి భోగి వేడుకలు నిర్వహించిన భారత్ జాగృతి హైదరాబాద్ ప్రతినిధులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, భారత్ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, భారత్ జాగృతి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, మారిషస్ తెలుగు మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.