మనోవికాస కేంద్రంలో పొంగల్..పాల్గొన్న దాస్యం

మనోవికాస కేంద్రంలో పొంగల్..పాల్గొన్న దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : దేశంలోని గొప్ప పండుగల్లో ఒక పండుగలా జరుపుకునే సంక్రాంతి పర్వదినాన్ని ఇలా ఆశ్రమాలలో నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. నగరంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో జరిగిన భోగి వేడుకల్లో దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. మల్లికాంబ మనోవికాస కేంద్రంలో సంప్రదాయ దుస్తులు ధరించి, తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తయారైన విద్యార్థులంగా భోగి, సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. వీరితో పాటు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భోగి మంటలు వెలిగించారు.మనోవికాస కేంద్రంలో పొంగల్..పాల్గొన్న దాస్యంఅనంతరం వారికి మాజీ కార్పొరేటర్ మిర్యాలకార్ దేవేందర్ ఆధ్వర్యంలో నూతన దుస్తులు పంపిణీ చేశారు. మనోవికాస కేంద్రంలోని వారందరికి ఎల్లవేళలా తాను అండగా ఉంటానని దాస్యం భరోసా ఇచ్చారు. సమాజంలో ప్రతీ ఒక్కరు తమవంతుగా సామాజిక బాధ్యతను పంచుకోవాలని ఆయన కోరారు. మనోవికాస కేంద్రంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వహకులను చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ అధ్యక్షులు పొడిశెట్టి అనిల్, కార్పొరేటర్ రావుల కోమల కిషన్, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేశవ రెడ్డి మరియు ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.