సంక్రాంతి సంబరాల్లో దర్శకుడు వివి.వినాయక్

సంక్రాంతి సంబరాల్లో దర్శకుడు వివి.వినాయక్

సంక్రాంతి సంబరాల్లో దర్శకుడు వివి.వినాయక్

వరంగల్ టైమ్స్, కృష్ణాజిల్లా : తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవాలని ప్రముఖ సినీ దర్శకుడు వి.వి.వినాయక్ ఆకాంక్షించారు. కృష్ణాజిల్లా గుడివాడ కే కన్వెన్షన్ ప్రాంగణంలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు ప్రదర్శనల్లో దర్శకుడు వినాయక్ పాల్గొన్నారు. కొడాలి నానితో కలిసి, ప్రదర్శన ఆసక్తిగా తిలకించిన వినాయక్, ఒంగోలు జాతి పశుపోషకులను అభినందించారు. అనంతరం జూనియర్ విభాగంలో నిర్వహించిన ప్రదర్శనల్లో విజేతలకు దర్శకుడు వినాయక్ బహుమతులను అందజేశారు.

గుడివాడలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందనీ దర్శకుడు వినాయక్ అన్నారు.మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతికే సంక్రాంతి వేడుకలనీ, తెలుగు రాష్ట్రల ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దర్శకుడు వినాయక్ తో ఫోటోలు దిగేందుకు రైతులు, యువకులు ఆసక్తి ప్రదర్శించారు.