దాస్యంను భారీ మెజార్టీతో గెలిపించండి : రేవతి
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వరంగల్ పశ్చిమ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో పాటు ఆయన సతీమణి దాస్యం రేవతి ఎన్నికల ప్రచార హోరు పెంచారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఎన్నిక ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 61వ డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, దాస్యం చేసిన అభివృద్ధిని ప్రతీ ఒక్కరికీ వివరిస్తున్నారు.రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటేసి, దాస్యం వినయ్ భాస్కర్ ను భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధిని కొనసాగించండి అని కోరుతున్నారు.