రేటెంత రెడ్డి మాటలు ఎవరూ నమ్మరు : గండ్ర

రేటెంత రెడ్డి మాటలు ఎవరూ నమ్మరు : గండ్ర

రేటెంత రెడ్డి మాటలు ఎవరూ నమ్మరు : గండ్రవరంగల్ టైమ్స్, భూపాలపల్లి జిల్లా : విశ్వసనీయత లేని పార్టీల మాటలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని భూపాలపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలం కాల్వపల్లి, గిద్దెముత్తారం, రాఘవపూర్ గ్రామాలలో ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా కాల్వపల్లి, గిద్దెముత్తారం, రాఘవపూర్ గ్రామాల్లో ప్రజల నుంచి విశిష్ట స్పందన లభించింది. మహిళలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని గండ్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిద్దెముత్తారం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీని వీడి 20మంది నాయకులు, పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. వీరికి గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు.రేటెంత రెడ్డి మాటలు ఎవరూ నమ్మరు : గండ్రఎమ్మెల్యేగా పరిపాలన అందిస్తూ,మా తండ్రి గారి పేరు మీద జీఎంఆర్ఎం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ,నిరుపేద ప్రజలకు అండగా నిలుస్తున్నాం. విద్య కోసం నా దగ్గరికి ఎవరు వచ్చినా జిఎంఆర్ఎమ్ ట్రస్ట్ ద్వారా తోచిన స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.భూపాలపల్లి జిల్లా ప్రభుత్వఆస్పాత్రిలో రోగితో పాటు వచ్చిన అటెండర్ కు గడిచిన మూడేళ్లుగా నిత్యం మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు.సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కార్పొరేట్ స్థాయి వైద్యపకులను తీసుకువచ్చి వారికి ఉచితంగా ఎస్సై మరియు కానిస్టేబుల్,గ్రూప్స్ కోచింగ్ అందించి వారికి అండగా నిలవడం జరిగిందన్నారు.నాకు దైవభక్తి ఎక్కువ.మా నాన్నగారు నాకు తిరుమల వెంకన్న పేరు నామకరణం చేయడంతో నా ఇష్ట దైవంగా ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని భూపాలపల్లి మంజునగర్లో దేవాలయం నిర్మిస్తే దేవాలయంపై కూడా రాజకీయం చేస్తున్న సన్యాసులకు ప్రజలు బుద్ధి చెప్పాలి.

దేవాలయం ఏర్పాట్లలో ఏ ఒక్కరు సహాయం తీసుకోకుండా ఆలయం నిర్మిస్తున్న క్రమంలో చాలామంది భక్తులు ముందుకు వచ్చి మేము కూడా భాగస్వామ్యం అవుతామని వస్తుంటే నేను నేరుగా తీసుకోకుండా ఆలయం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కి బ్యాంకు ద్వారా వారు విరాళాలు అందించారు. అయినప్పటికీ నా కుటుంబ సభ్యులు బంధువులు నియోజకవర్గ ప్రముఖులు వారికి తోచిన డబ్బులతో ఆలయం నిర్మించే తప్ప ఎటువంటి అవినీతికి పాల్పడలేదని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ అభివృద్ధిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను, తన నాయకత్వాన్ని గుర్తించి కారు గుర్తుకే ఓటెయ్యాలని ఆయన కోరారు. మరోసారి గెలిపించి భూపాలపల్లి అభివృద్ధికి దోహదపడాలని ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సూచించారు.