తెలంగాణలో నాన్ క్యాడర్ ఎస్పీలకు పదోన్నతి

తెలంగాణలో నాన్ క్యాడర్ ఎస్పీలకు పదోన్నతిహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన 20 మంది నాన్ క్యాడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా లభించింది. ఈ 20 మంది ఎస్పీలకు ఐపీఎస్ గా పదోన్నతులు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందిన వారిలో ఎన్ కోటిరెడ్డి, ఎల్ సుబ్బరాయుడు, కే నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాస్ రావు, టి. శ్రీనివాస్ రావు, టి.అన్నపూర్ణ, పీవీ పద్మజా, జానకి ధరావత్, పి.యాదగిరి, కేఆర్ నాగరాజు, ఎం.నారాయణ, వి. తిరుపతి, ఎస్.రాజేంద్రప్రసాద్, డి.ఉదయ్ కుమార్ రెడ్డి. కె. సురేష్ కుమార్, బి. అనురాధ, సి.అనసూయ, షేక్ సలీమా, ఆర్.గిరిధర్, సీహెచ్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు.