రంజీ జట్టుకు ఎంపికైన మాస్టర్ బ్లాస్టర్ కొడుకు

రంజీ జట్టుకు ఎంపికైన మాస్టర్ బ్లాస్టర్ కొడుకుముంబై : ఈ యేడాది ముంబై రంజీ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. అయితే అర్జున్ టెండూల్కర్ ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో సెలెక్టర్ సలిల్ అంకోలా తెలిపారు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న తర్వాత అర్జున్ టెండూల్కర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడని సెలెక్టర్ సలిల్ అంకోలా తెలిపారు. ముంబై క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అర్జున్ ని జట్టుకు ఎంపిక చేసినట్లు చెప్పాడు.

మహారాష్ట్ర, ఢిల్లీతో జరిగే మ్యాచ్ లకు సంబంధించిన ముంబై జట్టును ప్రకటించారు. ముండై టీ20 జట్టుకు గతంలో ప్రాతినిధ్యం వహించిన అర్జున్, ఇప్పటి వరకు ఆ జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడలేదు. గత యేడాది కొవిడ్ వల్ల రంజీ టోర్నీని నిర్వహించలేదు. జనవరి13 నుంచి కోల్ కతా వేదికగా మహారాష్ట్రతో పృథ్వీషా నేతృత్వంలోని ముంబై జట్టు రంజీ మ్యాచ్ ఆడనున్నది.