ఇంటిపై నల్లా జెండాతో ఎమ్మెల్యే చల్లా నిరసన

ఇంటిపై నల్లా జెండాతో ఎమ్మెల్యే చల్లా నిరసన

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : కేంద్రం వరి కొనేదాకా కొట్లాడుడే అనే శపథంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రోజుకో వినూత్న నిరసనను తెలుపుతున్నారు. పార్టీ పిలుపు మేరకు తూచా తప్పకుండా కేంద్రానికి వినూత్నంగా నిరసన సెగలు తగిలిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసన తెలిపారు. ఇంటిపై నల్లా జెండాతో ఎమ్మెల్యే చల్లా నిరసనపరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హనుమకొండ జిల్లా నక్కలగుట్టలోని ఆయన నివాసంపై నల్ల జెండా ఎగుర వేశారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆవలంబిస్తున్న వివక్ష, రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. ఎమ్మెల్యే చల్లా పిలుపు మేరకు పరకాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో రైతులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వారి వారి ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపారు. వరి కొనుగోలు విషయంలో బీజేపీ వైఖరిని ఎండగడుతూ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.