పరకాలలో కాంగ్రెస్, బీజేపీ క్లీన్ స్వీప్
-చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో భారీ చేరికలు
-చల్లా వైపే సొసైటీ చైర్మన్లు,కమిటీ సభ్యులు
-చల్లాకు జై కొడుతున్న రైతుబందు సమితి,గ్రామ కన్వీనర్లు
-ధర్మారెడ్డికి మద్దతుగా అన్ని కుల సంఘాలు
వరంగల్ టైమ్స్,వరంగల్ జిల్లా: పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు బీఆర్ఎస్ కే జై కొడుతున్నారు. ఎమ్మెల్యేగా చల్లా ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకుని, మాట నిలుపుకున్న సీఎం కేసీఆర్ పాలనా తీరుకు ఫిదా అయిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం తమ పార్టీలను వదిలి చల్లా ధర్మారెడ్డి బాటపట్టారు.భారీ మెజార్టీతో చల్లా ధర్మారెడ్డిని గెలిపించుకుంటామని ప్రజల పక్షాన నిలబడుతున్నారు. ఇందులో భాగంగానే బుధవారం పలు గ్రామాల నుంచి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హనుమకొండ నక్కలగుట్టలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.వీరికి చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.సంగెం మండలం కాపుల కనపర్తి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో వేల్పుల రాజేష్,వర్కాల సతీష్,జిట్టా శివ,జన్ను సుమన్,మారేపల్లి రాకేష్,సదిరం భరత్, జన్ను కార్తిక్,బార్ల రాజేష్,సదిరం శశి కుమార్,సదిరం సాగర్,ఎర్ర ప్రవీణ్,కందిక రాజేష్,సదిరం శ్రీను,ఎర్ర సది, సదిరం సమ్మయ్య,తడుగుల బాబులతో పాటు పలువురు ఉన్నారు.ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామం నుంచి కాంగ్రెస్ మండల నాయకులు ఉప్పుగల్లు రాజిరెడ్డి, బీజేపీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మందపెల్లి భాస్కర్ ఆయా పార్టీలకు రాజీనామా చేస్తూ చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.ఈ ఎన్నికల్లో కూడా పరకాలలో గులాబీ జెండా ఎగరవేస్తామంటూ పరకాల నియోజకవర్గంలోని సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు,రైతు బంధు సమితి మండల, గ్రామ కన్వీనర్లు,మండల కో ఆప్షన్లు చల్లా ధర్మారెడ్డి సమక్షంలో సమావేశమయ్యారు.తమ మద్దతు చల్లా ధర్మారెడ్డికే అని నినదించారు.ఇక చల్లా ధర్మారెడ్డికి పరకాల నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా అన్ని సంఘాల సభ్యులు చల్లా బాటపట్టి, బీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. పరకాల మండలం లక్ష్మీపురం గ్రామ ముదిరాజు కులస్థులు ముక్తకంఠంతో ప్రకటించారు. బుధవారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో చల్లా ధర్మారెడ్డిని ముదిరాజ్ కులస్థులు, నాయకులు గురిజాపల్లి ప్రకాష్ రావు, మాజీ ఎంపిటీసి పల్లెబోయిన రాజయ్య, మాజీ సర్పంచ్ ఆముదాలపల్లి అశోక్, పల్లెబోయిన రవీందర్, ఆముదాలపల్లి శ్రీనివాస్, గ్రామ పార్టీ అధ్యక్షులు పల్లెబోయిన రాజు, మాజీ డైరెక్టర్ పల్లెబోయిన సురేష్, మాజీ డౌరెక్టర్ దానం నిరంజన్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసారు. తమ స్వార్ధాల కోసం పార్టీలు మారిన వారికి తగిన గుణపాఠం చెబుతామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చల్లా ధర్మారెడ్డికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లోనూ పరకాలలో గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.పదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులు,సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించాలని చల్లా ధర్మారెడ్డి కోరారు. ప్రజాప్రతినిధులు,పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.ఇప్పటికే బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందని అన్నారు.అందరి సంక్షేమమే కేసీఆర్ లక్ష్యమని,కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మి ప్రజలు ఆగం కావద్దని కోరారు.తమకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ప్రతీ ఒక్కరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి చల్లా ధర్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.