నేత కార్మికులకు నేతన్న బీమా  

నేత కార్మికులకు నేతన్న బీమా

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా ‘ పథకంను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈ పథకం అమలుకు వీలుగా ప్రభుత్వ చేనేత, వస్త్ర శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ రూ.29.88 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.నేత కార్మికులకు నేతన్న బీమా  రాష్ట్రంలోని 55,072 మంది నేతన్నలకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకంను తెలంగాణ సర్కార్ త్వరలోనే ప్రారంభించబోతున్నది. పవర్ లూమ్, యాన్సిలరీ, చేనేత కార్మికులు మరణిస్తే ఎల్ ఐసీ ద్వారా బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా అందించనున్నది.

 

ts government to implement insurance scheme for weavers