హోంమంత్రి ఇంట్లో ఘనంగా రంజాన్ వేడుకలు

హోంమంత్రి ఇంట్లో ఘనంగా రంజాన్ వేడుకలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ ఆలీ రంజాన్ పండగ వేడుకలను మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కులో చిన్న మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్థానిక ముస్లిం సోదరులకు పరస్పరం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.హోంమంత్రి ఇంట్లో ఘనంగా రంజాన్ వేడుకలుపవిత్ర ఖురాన్ గ్రంథం పఠిస్తూ దాదాపు నెల రోజులు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ముస్లిం సోదరులు ఈ సందర్భంగా హోం మంత్రిని కలిసి ఈద్ ముబారక్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడారు. క్రమశిక్షణలతో ఉపవాస దీక్షలు ముస్లిం సోదరులు భవిష్యత్తులోనూ ఈ తరహాలోనే క్రమశిక్షణతో తమ విధులను నిర్వహించడం ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని తెలిపారు. తద్వారా తమ జీవితాలను సన్మార్గంలో నడుపుకోవాలని హితవు చెప్పారు.

కష్టసుఖాలను పరస్పరం పంచుకుంటూ అన్ని మతాల అన్ని కులాల వారితో సోదర భావం పెంపొందించుకోవాలని హోంమంత్రి కోరారు. అన్ని వర్గాల వారిని సమాన దృక్పథంతో చూస్తూ వారికి సంక్షేమ పథకాలను అమలు చేసే సెక్యులర్ నాయకుడు రాష్ట్ర సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కులమతాలు,ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరి భద్రత, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ భారీ బడ్జెట్ తో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని హోం మంత్రి అన్నారు.హోంమంత్రి ఇంట్లో ఘనంగా రంజాన్ వేడుకలురంజాన్ పండుగను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. రంజాన్ సందర్భంగా శాసన మండలి సభ్యులు ఎం.ఎస్.ప్రభాకర్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, హోం సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్, జాయింట్ సి పి రమేష్ రెడ్డి తదితరులు హోం మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.