యాదాద్రీశుడి సేవలో ఏపీ విద్యాశాఖ మంత్రి 

యాదాద్రీశుడి సేవలో ఏపీ విద్యాశాఖ మంత్రి

వరంగల్ టైమ్స్, యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి దేవస్థానాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. 2015లో యాదాద్రీశుడి దర్శనానికి వచ్చానని, 7 ఏళ్ల అనంతరం స్వామివారి ఆశీస్సులకోసం వచ్చినట్లు తెలిపారు. ఇంత గొప్పగా తీర్చిదిద్దిన కేసీఆర్ కు ఆ దేవుడి ఆశీస్సులుండాలని వేడుకొన్నట్లు తెలిపారు.యాదాద్రీశుడి సేవలో ఏపీ విద్యాశాఖ మంత్రి మంగళవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం యాదాద్రికి చేరుకున్న మంత్రి ప్రధానాలయంలో స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. ప్రాకారంలోని అద్దాల మండపంలో ఆయనకు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు.

అనంతరం మా కుమారుడి వివాహం అనంతరం తిరుపతి దర్శనానికి వెళ్లాలనని, ఆ తరువాత మా ఇష్టదైవమైన యాదగిరిగుట్టకు వచ్చినట్లు తెలిపారు. కుటుంబసభ్యులతో స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి వేడుకున్నానని అన్నారు.