హైదరాబాద్ లో వర్ష బీభత్సం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో పలు చోట్ల చెట్లు, ఫ్లెక్సీలు విరిగిపడ్డాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. అత్యధికంగా సీతాఫల్ మండిలో 7.2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదయింది.ఇక బన్సీలాల్ పేటలో 6.7, వెస్ట్ మారేడుపల్లిలో 6.1, అల్వాల్ లో 5.9, ఎల్బీనగర్ లో 5.8, బాలానగర్ లో 5.4, ఏఎస్ రావు నగర్ లో 5.1, బేగంపేటలోని కొన్ని ప్రాంతాల్లో 4.9, మల్కాజ్ గిరిలో 4.7, ఫలక్ నుమాలో 4.6, గన్ ఫౌండ్రీలో 4.4, కాచిగూడ, సికింద్రాబాద్ లో 4.3, చార్మినార్ లో 4.2, గుడిమల్కాపూర్ , నాచారంలో 4.1, అంబర్ పేటలో 4, అమీర్ పేట, సంతోష్ నగర్ లో 3.7, ఖైరతాబాద్ లో 3.6, బేగంబజార్, హయత్ నగర్, చిలుకానగర్ లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో తెల్లవారు జాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
heavy rains in hyderabad and telangana districts