పరకాలలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ చేరికలు

పరకాలలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ చేరికలు

వరంగల్ టైమ్స్,వరంగల్ జిల్లా: టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో ముందంజలో ఉందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పాలనాతీరుకు తెలంగాణ ప్రజలే కాకుండా రాజకీయాలకతీతంగా ఆకర్షితులవుతూ గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వస్తున్నారని ఆయన అన్నారు. ఇందులో భాగంగానే పరకాల నియోజకవర్గం సంగెం మండలం పల్లారుగూడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే చల్లా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలో నాయకులు కప్పాటి పాపిరెడ్డి, కప్పాటి రాజమౌళి తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, వరంగల్ మార్కెట్ డైరెక్టర్ పసునూరి సారంగపాని, జెడ్పీటీసి గూడ సుదర్శన్ రెడ్డి, సర్పంచులు కక్కెర్ల కుమారస్వామి, బుచ్యనాయక్, దోనికెల శ్రీనివాస్, ఎంపీటీసి మాజీ జెడ్పీటీసి గుగులోతు వీరమ్మ, గోపిసింగ్, కో ఆప్షన్ ఎస్.కె.మన్సూర్ అలీ, నాయకులు వీరన్న, మోహినుద్దీన్, కొమురెల్లి, మార్కండేయ, శ్రీరాములు వేణు, తదితరులు పాల్గొన్నారు.