నేడు ముచ్చింతల్ కు ఉపరాష్ట్రపతి

నేడు ముచ్చింతల్ కు ఉపరాష్ట్రపతివరంగల్ టైమ్స్,రంగారెడ్డి జిల్లా: ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో సమతామూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం గంటపాటు అష్టాక్షరీ మహామంత్ర జపం జరిగింది. అనంతరం యాగశాలలో లక్ష్మీనారాయణ మహాయాగం జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి పరమేష్టి ఇష్టి, వైభవేష్టి ఇష్టి హోమాలు నిర్వహించనున్నారు.

నేడు సమతామూర్తి కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ముచ్చింతల్ చేరుకుంటారు. రామానుజాచార్యుల విగ్రహంపై 3డీ మ్యాపింగ్ ను వీక్షించనున్నారు. అనంతరం ప్రవచన మండపంలో భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొంటారు.