సమతామూర్తి వేడుకలకు హాజరుకానున్న రాష్ట్రపతి

సమతామూర్తి వేడుకలకు హాజరుకానున్న రాష్ట్రపతివరంగల్ టైమ్స్,హైదరాబాద్: ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలో రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నేడు సమతామూర్తి కేంద్రానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ముచ్చింతల్ చేరుకుంటారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజాచార్యుల బంగారు విగ్రహంను ఆవిష్కరించనున్నారు. ఆలయాలు, బృహాన్ మూర్తి విగ్రహాన్ని సందర్శించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5 గంటలకు వరకు ఉత్సవాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు జీయర్ ఆశ్రమం నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు9. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజ్ భవన్ కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరనున్నారు.