విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి

విద్యుత్ షాక్ తో ఏనుగు మృతివరంగల్ టైమ్స్, అమరావతి: విద్యుత్ షాక్ తో ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మాధవరంలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టడంతో స్తంభం విరిగి ఏనుగుపై విద్యుత్ తీగలు పడటంతో ఏనుగు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారణాలను స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. శవ పంచనామా నిర్వహించారు.