గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

వరంగల్ టైమ్స్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌లో తుపాకీ మిస్‌ఫైర్‌ అయింది. ఈ ఘటనలో హెడ్‌ కానిస్టేబుల్‌ సంతోష్‌ అక్కడికక్కడే మృతి చెందారు. నైట్‌డ్యూటీలో ఉన్న సంతోష్ శనివారం తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. సంతోష్‌ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.