జమ్ములో ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

వరంగల్ టైమ్స్, శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని సోపోర్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని డంగీవాచా ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా ముగ్గురు టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వారిని అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా గుర్తించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పోలీసులు, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సంయుక్తంగా బందీపొరాలో గాలింపు చేపట్టాయి. గాలింపు బృందాలపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. దీంతో ఓ పోలీసు మృతి చెందగా, పలువురు పౌరులు గాయపడ్డారు.